![]() |
![]() |
.webp)
సంక్రాంతి సందర్భంగా 'వాల్తేరు వీరయ్య' మూవీ రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో తన ఫాన్స్ కి డబుల్ ధమాకా ఇవ్వడానికి చిరు రెడీ అయ్యారు. ఫస్ట్ టైం ఒక గేమ్ షోలో అదే "సుమా అడ్డా"లో కనిపించి అలరించబోతున్నారు. ఫేమస్ యాంకర్ సుమ రీసెంట్ గా స్టార్ట్ చేసిన గేమ్ షోకు చిరు గెస్ట్‌గా వెళ్లారు. ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో రిలీజ్ అయ్యింది.
ఈ రాబోయే ఎపిసోడ్ లో సుమతో మెగాస్టార్ చేసిన సందడి వేరే లెవెల్ అన్నమాట. చిరుతో కలిసి డ్యాన్స్ చేసిన వీడియోను సుమ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఐతే ఈ షో ఫస్ట్ ఎపిసోడ్ కి సంతోష్ శోభన్ టీమ్ వచ్చి ఫుల్ కామెడీ చేసి వెళ్ళింది. సెకండ్ ఎపిసోడ్‌కు మెగాస్టార్ చిరంజీవి, డైరక్టర్ బాబీ గెస్ట్ గా వచ్చారు. గతంలో ఆహాలో ప్రసారమైన సమంత చాట్ షోకి చిరు వచ్చారు. కానీ తొలిసారిగా చిరు హాజరైన గేమ్ షో ఇదే.
'వాల్తేర్ వీరయ్య' మూవీ సంక్రాంతి సందర్భంగా జనవరి 13న రిలీజ్ కాబోతోంది. ఇక ఈ గేమ్ షోలో సుమ హడావిడి మాములుగా లేదు.. చిరు చేయి చూస్తూ "ఈ రేఖల్లో ఏ రేఖ అంటే మీకు భయం" అని విద్యుల్లేఖా రామన్ అడిగేసరికి "ఆయన లక్ష్మణ రేఖనైనా దాటతారు కానీ సురేఖను దాటి రారు" అని సుమ కౌంటర్ వేసింది. దానికి చిరు పడీ పడీ నవ్వేశారు.
ఇక ఈ షోలో వెన్నెల కిషోర్ కూడా తనదైన స్టయిల్లో కామెడీ చేసి ఎంటర్టైన్ చేశారు. మరి ఈ రాబోయే ఎపిసోడ్ ఎలా ఉండబోతోందో తెలియాలంటే కొన్ని డేస్ వెయిట్ చేయాల్సిందే . వాల్తేరు వీరయ్యపై ఆడియన్స్ లో భారీ అంచనాలున్నాయి. ఎందుకంటే మెగాస్టార్ చిరు పక్కా మాస్ లుక్‌లో కనిపించబోతున్న మూవీ ఇది.
![]() |
![]() |